సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన క్రౌన్ ప్రిన్స్, పుతిన్
- April 22, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, రష్యాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను, వాటిని వివిధ రంగాల్లో అభివృద్ధి చేసే మార్గాలను ఇరుపక్షాలు సమీక్షించాయి. దీంతోపాటు ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలకు సంబంధించి అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఫోన్ కాల్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు క్రౌన్ ప్రిన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో OPEC ప్లస్‌లో సమన్వయ స్థాయిపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయని పేర్కొంది. అంతేకాకుండా సౌదీ అరేబియా, బ్రిక్స్ మధ్య సహకార అవకాశాలపై చర్చించారు. మే నుండి 2023 చివరి వరకు రోజుకు 500,000 బ్యారెళ్ల స్వచ్ఛంద కోతను అమలు చేస్తామని సౌదీ అరేబియా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







