ఈద్ అల్ ఫితర్: ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన యూఏఈ అధ్యక్షుడు
- April 22, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ ఫోటోను ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పంచుకున్నారు. “సెలవులను కుటుంబం, ప్రియమైనవారితో గడపడం ఒక వరం. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ, ప్రపంచ ప్రజలు శాంతి, సంతోషాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను" అని యూఏఈ అధ్యక్షుడు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌కు 3.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత సంవత్సరం, ఈద్ అల్ ఫితర్ విరామ సమయంలో షేక్ మొహమ్మద్ తన మనవరాళ్లతో ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు రోజు షేక్ మొహమ్మద్ ఎమిరేట్స్ పాలకులు, పౌరులు, నివాసితులు, అరబ్ , ఇస్లామిక్ దేశాల నాయకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!







