ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ సిఎం జగన్ అభినందనలు
- April 22, 2023
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే. ఈ విషయంపై సిఎం జగన్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేశారని కొనియాడారు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ మొత్తం 25 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఈ మధ్యాహ్నం 2.19 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రోదసిలోకి దూసుకెళ్లింది. పూర్తిస్థాయి వాణిజ్యపరంగా చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇస్రో ప్రణాళికల్లో పూర్తిస్థాయి వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇది ఐదవది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







