హారర్ ఫ్యాక్టర్ ‘విరూపాక్ష’కి ప్లస్సా.? మైనస్సా.?
- April 24, 2023
కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతాయో అస్సలు తెలీదు. ఎంటర్టైన్మెంట్ వుంటేనే ఏ సినిమా అయినా హిట్టవుతుంది అని కూడా అనుకోలేం. అస్సలేమాత్రం ఎంటర్టైన్మెంట్ లేని సినిమాలు కూడా ఒక్కోసారి సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయ్.
అలాంటి కోవలోకి చేరేదే తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరూపాక్ష’. అస్సలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు. కంప్లీట్ సీరియస్ మూవీ. హారర్ ఫ్యాక్టర్ మూవీ. అయినా కానీ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు ప్రేక్షకులు.
రెండో వారం గడిచినా ఈ సినిమాకి జనం పోటెత్తుతున్నారు. హౌస్ ఫుల్ బోర్డులతో ధియేటర్లు కళకళలాడుతున్నాయ్. హారర్ ఫ్యాక్టర్ అనే బేస్‌తో పిల్లలు ఈ సినిమా చూసేందుకు కాస్త వెనుకాడుతున్నారనే అపోహ వున్నప్పటికీ, అదే ఫ్యాక్టర్ ఈ సినిమాని సక్సెస్ అయ్యేలా చేసిందన్న టాక్ మరోవైపు వుంది.
ఏది ఏమైనా యాక్సిడెంట్ తర్వాత ఓ సీరియస్ మూవీతో సాయి ధరమ్ తేజ్ ఇంత పెద్ద హిట్ కొట్టడం నిజంగా విశేషమే. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ‘విరూపాక్ష’ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మేనియా ఎన్ని రోజులుంటుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







