పాపకి ఈ సారైనా హిట్ వచ్చేనా.!
- April 24, 2023
‘గద్దల కొండ గణేష్’ సినిమాతో ‘సూపర్ హిట్టూ.. బొమ్మా హిట్టూ..’ అంటూ ఐటెం సాంగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతీ.
డస్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత ‘ఖిలాడీ’ సినిమాలో హద్దులు మీరిన అందంతో రెచ్చిపోయి హీరోయిన్ ట్యాగ్ మెడలో వేసేసుకుంది.
అయితే, ఆ సినిమా కోసం అమ్మడు ఎంతలా అందాలారబోసేసినా అనుకున్న క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. పెద్దగా ఆఫర్లు చేజిక్కించుకోలేకపోయింది.
తాజాగా గోపీచంద్ సినిమాతో మరోసారి డింపుల్ హయాతీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత గోపీచంద్ నుంచి వస్తున్న సినిమా ఇది. బజ్ బాగుంది. చూడాలి మరి, హిట్ అవుతుందో.! ఫట్ అని తేలిపోతుందో.! డింపుల్ లక్ ఎలా వుందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







