వర్షాల కారణంగా ఒమన్‌లో డిస్టెన్స్ లెర్నింగ్ అమలు
- April 25, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా మంగళవారం డిస్టెన్స్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నట్లు సూర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ మేరకు యూనివర్శిటీ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, లోయలను దాటడం వంటి సహసాలు చేయవద్దని, వరద ప్రాంతాలకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ తన ప్రకటనలోసూచించింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లో ఉన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల వల్ల కలిగే నష్టాల గురించి నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (NMHEWS) జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







