ఎయిర్ కేరళ పేరుతో కొత్త భారతీయ విమానయాన సంస్థ..!

- April 25, 2023 , by Maagulf
ఎయిర్ కేరళ పేరుతో కొత్త భారతీయ విమానయాన సంస్థ..!

యూఏఈ: దుబాయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త దక్షిణ-భారత రాష్ట్రమైన కేరళ నుండి ప్రవాసుల కోసం విమానయాన సంస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు అఫీ అహ్మద్ మాట్లాడుతూ.. ఎయిర్ కేరళ ప్రాజెక్ట్‌ను నిజం చేసేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో, వ్యాపారవేత్త మరొక స్థానిక కంపెనీకి airkerala.com డొమైన్ పేరు కోసం 1 మిలియన్ దిర్హామ్‌లను చెల్లించాడు. ఎయిర్ కేరళ అనేది కేరళ ప్రభుత్వం 2005లో ప్రకటించిన ప్రాజెక్ట్ అని, దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులలో హాట్ టాపిక్‌గా ఉందని, దాంతో ఎలాంటి ఆలోచన చేయకుండా ఎయిర్ కేరళ డొమైన్ ను కొనుగోలు చేసినట్లు అఫీ అహ్మద్ వెల్లడించారు.

కేరళ ప్రభుత్వ ప్రతిపాదిత విమానయాన సంస్థ, ఎయిర్ కేరళ 2006లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL)కి పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా నమోదు చేయబడింది. యూఏఈలో నివసిస్తున్న కేరళీయులకు ఆకాశాన్నంటుతున్న టిక్కెట్ ధరలు, విమానాల కొరత నుండి ఉపశమనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ కేరళ సంవత్సరాలుగా విస్తృతంగా చర్చలో ఉన్నా.. అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు.

ఎయిర్ కేరళ విమానయాన సంస్థను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యాన్ని తాను ప్రకటించినప్పటి నుండి యుఎఇలోని మలయాళీ సంఘాల నుండి తనకు మద్దతు లభించిందని అఫీ చెప్పారు. "చాలా మంది వ్యాపారవేత్తలు నన్ను సంప్రదించారు. ప్రాజెక్ట్ అమలు చేయడానికి డబ్బును అందించడానికి ముందుకు వస్తున్నారు," అని అతను వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com