నరేష్ - పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’.! ఏందిరా ఇండస్ట్రీకి ఈ లొల్లి.!
- April 25, 2023
ఓయో రూమ్‌లో జంటగా అడ్డంగా దొరికిపోయిన నరేష్, పవిత్రా లోకేష్ ఈ మధ్య ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ తర్వాత వీరిద్దరి మధ్యా వున్నసంబంధాన్ని అధికారికంగా ప్రకటించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే వుంది ఈ జంట.
అదలా వుంటే, ఈ పైత్యంతోనే దక్కించుకున్న ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి నరేష్ గట్టిగానే ప్లాన్ చేశాడు. ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌తో ఓ సినిమా చేసేశాడు. అందులో హీరో, హీరోయిన్లు ఈ సెన్సేషనల్ వృద్ధ జంటే కావడం విశేషం.
వాళ్ల బయోపిక్‌ని వాళ్లే తీసేసుకున్నారన్న మాట. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు ఘనంగా రానుంది. ఆ నేపథ్యంలోనే ప్రమోషన్లు మొదలెట్టబోతున్నారట త్వరలో.
సినిమా ప్రమోషన్లలో భాగంగా దేశమంతా తిరిగేయనున్నారట. ఎంత ఖర్చయినా సరే, సినిమాని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేయాలనుకుంటున్నాడట నరేష్.
నరేష్ చేస్తున్న ఈ అతి పైత్యానికి ఇండస్ట్రీ అంతా ముక్కున వేలేసుకుంటోంది. అయినా డోంట్ కేర్.. నేననుకున్నదే నే చేస్తా.! అంటున్నాడట నరేష్. ఈ ఏజ్‌లో ఏందిరా బాబూ ఈ లొల్లి అంటూ నరేష్‌పై నోటికొచ్చినట్లు కామెంట్లు వేసుకుంటున్నారు ఈ విషయం తెలిసిన సినీ జనం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







