‘మంగళవారం’.! మళ్లీ బోల్డ్ అవతారమెత్తిన పాయల్ రాజ్ పుత్.!
- April 25, 2023
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. బోల్డ్ బ్యూటీ అనే పేరు తెచ్చుకుంది ఈ సినిమాతో పాయల్. ఆ పేరే ఆమెకు ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది కూడా.
క్రేజ్ అయితే దక్కించుకుంది కానీ, అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్ కానీ, అవకాశాలు కానీ దక్కించుకోలేకపోయింది పాయల్ రాజ్‌పుత్. రవితేజ తదితర సీనియర్ హీరోల సరసన నటించినా పాయల్‌ని పెద్దగా పట్టించుకోలేదు.
దాంతో, తనను ఇండస్ర్టీకి పరిచయం చేసిన తొలి డైరెక్టర్‌తోనే ఓ సినిమాకి కమిట్ అయ్యింది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా టైటిలే ‘మంగళవారం’. వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో పాయల్ రాజ్‌పుత్, బ్యాక్ ఓపెన్‌తో మత్తెక్కించే చూపుల్తో తన గత ఇమేజ్‌ని తలపించేలా కనిపిస్తోంది. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకుడు.
సినిమాలో శైలజ పాత్రలో పాయల్ నటిస్తోందట. ఈ పాత్ర చాలా విభిన్నంగా ఆసక్తికరంగా వుండబోతోందట. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ అవాక్కయ్యేంతలా వుండబోతోందట. ఇంతవరకూ ఈ తరహా కాన్సెప్ట్‌ని ఎవ్వరూ టచ్ చేసి వుండరని ఇన్‌సైడ్ టాక్. ఇంతకీ ‘మంగళవారం’ సినిమా కాన్సెప్ట్ ఏంటో రిలీజ్ అయితే కానీ తెలీదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







