కువైట్ సివిల్ ఏవియేషన్ సిబ్బంది పనివేళల్లో మార్పులు
- April 26, 2023
కువైట్: రమదాన్ సెలవుల అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన ఉద్యోగుల కోసం పని వేళల్లో మార్పులు చేసింది. రెండు షిఫ్టులలో ఉద్యోగులను సెట్ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ సలేహ్ అల్-ఫదాగీ అధికారిక పని వేళలకు సంబంధించి ఒక సర్క్యులర్‌ను జారీ చేశారు. అధికారిక పని గంటలు ఆదివారం నుండి గురువారం వరకు రోజుకు 7 గంటలుగా నిర్ణయించారు. షిఫ్టులు ఉదయం 07:30 నుండి మధ్యాహ్నం 02:30 వరకు.. ఉదయం 08:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు ఉంటాయని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. తమ వీలునుబట్టి ఉద్యోగులు తమ పని వేళలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఉద్యోగులు తమ షిఫ్ట్ వేళలను సివిల్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ (portal.csc.gov.kw)లో సదరు అధికారులు ఆమోదించిన తర్వాత వాటిని సవరించే అవకాశం లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







