సబా అల్-అహ్మద్ ప్రాంతంలో సింహం పిల్ల హల్చల్
- April 27, 2023
కువైట్: సబా అల్-అహ్మద్ ప్రాంతంలో ఓ సింహం పిల్ల స్వేచ్ఛగా తిరగడం కలకలం రేపింది. ఈ సంఘటన స్థానికులలో భయాన్ని కలిగించింది. కాగా, అంతర్గత మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సెంటర్ కు సమాచారం అందగానే.. పోలీసులు, ప్రజా భద్రత, ట్రాఫిక్ పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సింహం పిల్లను బంధించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సింహం పిల్ల ఆ ప్రాంతంలోని దానిని పెంచుకుంటున్న యజమాని ఇంటి నుండి తప్పించుకుని వీధిలో స్వేచ్ఛగా తిరిగుతూ ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసిందని పేర్కొంది. క్రూర జంతువులను ఇండ్లలో పెంచటం చట్టవిరుద్ధం అని, సింహం పిల్ల యజమాని కోసం వెతుకుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







