ఒక్క సెన్సార్ కట్ లేకుండా 'రామబాణం' సినిమా
- April 27, 2023
హైదరాబాద్: లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రామబాణం. మే 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తీ చేసారు. సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా క్లిన్ యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.
ఈరోజుల్లో సెన్సార్ కట్స్ లేని సినిమాలు లేవనే చెప్పాలి. చాలా మంది తమ పిల్లలు ఫ్యామిలీతో సినిమాలు చూడాలంటే చాలా ఇబ్బందిపడుతున్నారు. సినిమాల్లోని సీన్స్ అలా ఉంటుంది. సెన్సార్ తర్వాత కూడా సినిమా చూడాలంటే ఇబ్బందిపడుతున్న రోజులివి. అలాంటిది ఒక కట్ కూడా లేకుండా సినిమా రావడం అంటే చాలా గొప్ప విషయమని సెన్సార్ సభ్యులే చెప్పడం విశేషం. కాబట్టి ప్రేక్షకులు కుటంబ సమేతంగా ఈ సినిమాని వీక్షించవచ్చు.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటించారు. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







