ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసిన కమీషనర్ చౌహాన్
- April 27, 2023
హైదరాబాద్: సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ను అధిగమించడానికి రూ. 5 లక్షల విలువైన 71, 250 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను, ఏసీ హెల్మెట్లను ఐదుగురు ట్రాఫిక్ సిబ్బందికి పంపిణీ చేశారు.
ఏప్రిల్ 14వ తేదీన రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ రాచకొండ ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత విభాగం అధికారులతో ట్రాఫిక్ మరియు రహదారి భద్రతపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది యొక్క భద్రతా పరికరాల సేకరణ మరియు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ట్రాఫిక్ సిబ్బందికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, సీపీ రాచకొండ రూ. 3.2 కోట్ల విలువైన స్పీడ్ లేజర్ గన్‌లు, డిజిటల్ కెమెరాలు, ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు అయిన బారికేడ్‌లు, కోన్‌లు, బొల్లార్డ్స్, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు మరియు కిట్‌బ్యాగ్‌లు, సేఫ్టీ హెల్మెట్‌లు, మాస్క్ లు, రేడియం జాకెట్లు, సన్ గ్లాసెస్, గ్లోవ్స్, వాటర్ బాటిల్స్, జంగిల్ షూస్ & రెయిన్ కోట్స్ వంటి కిట్ ఆర్టికల్స్ ట్రాఫిక్ సిబ్బందికి అందించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వేసవిలో ఎండల తీవ్రత నుండి రక్షించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. సరైన నంబర్ ప్లేట్లు లేని మరియు నకిలీ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహన యాజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నకిలీ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సీపీ డిఎస్ చౌహాన్, IPS, గారితో పాటు వి.సత్యనారాయణ, IPS, జాయింట్ పోలీస్ కమీనర్, డి. శ్రీనివాస్, డీసీపీ రాచకొండ ట్రాఫిక్-II, S.V. హరి కృష్ణ, ACP, LB నగర్ ట్రాఫిక్ డివిజన్, S. శ్రీనివాస్ రావు, ACP, మల్కాజిగిరి ట్రాఫిక్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ల SHOలు మరియు ఇతర ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







