సౌదీలో కుండపోత వర్షం.. వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్

- April 28, 2023 , by Maagulf
సౌదీలో కుండపోత వర్షం.. వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్

రియాద్: రియాద్ ప్రాంతంలోని హురేమిలా గవర్నరేట్‌లో కుండపోత వర్షం కారణంగా తన వాహనంలో చిక్కుకుపోయిన వ్యక్తిని తమ రెస్క్యూ బృందాలు రక్షించాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత భద్రతా సూచనలను పాటించడంలో విఫలమైనందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) సహకారంతో వాహన యజమానికి వ్యతిరేకంగా సంబంధిత నిబంధనలు వర్తింపజేయబడ్డాయని, సివిల్ డిఫెన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. భారీ వర్షం సమయంలో వరదను దాటడానికి డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉల్లంఘనకు పాల్పడ్డాడని తెలిపింది. వర్షాల సమయంలో వరదనీటిలో మునిగిపోకుండా లేదా కొట్టుకుపోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలు, నీరు చేరే ప్రదేశాలు, లోయలకు దూరంగా ఉండాలని డైరెక్టరేట్ పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com