భారతీయులకు ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ బంపరాఫర్..
- April 28, 2023
కువైట్ సిటీ: కువైట్ లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ యురేకా ఇండియన్ కమ్యూనిటీకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. అనేక విస్తృత శ్రేణి ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌లలో భారతీయులకు ప్రత్యేకమైన తగ్గింపులను అందుబాటులో ఉంచిన్నట్లు వెల్లడించింది. అత్యుత్తమమైన, అతిపెద్ద కలెక్షన్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ కమ్యూనిటీకి వారి షోరూమ్‌లలో ఎంపిక చేసిన అనేక ఉత్పత్తులపై ప్రత్యేకమైన తగ్గింపు ధరలకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా యురేకా పేర్కొంది. ఇక ఈ ప్రత్యేక తగ్గింపులు ఇంటర్నెట్ రౌటర్‌ల నుండి డెస్క్‌జెట్ ప్రింటర్ల వరకు, హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌ల నుండి ట్రిమ్మర్‌ల వరకు, ఎగ్ బాయిలర్‌ల నుండి గ్లాస్ కెటిల్స్ వరకు ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అందుబాటులో ఉన్నాయట. ఇండియన్ కమ్యూనిటీ ఇష్టపడే అనేక ఉత్పత్తులు ఈ ఆఫర్‌లో ప్రత్యేకంగా భారతీయ కమ్యూనిటీ కోసం అందుబాటులో ఉన్నాయి.
ఇక ఆఫర్‌లు అన్ని యురేకా షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ క్యాష్ కౌంటర్‌లో వారి సివిల్ ఐడీని చూపించి, ఇండియన్ కమ్యూనిటీ ఈ ప్రత్యేకమైన తగ్గింపు ధరను అడగాలి. కాగా, ఇండియన్ కమ్యూనిటీ కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్‌లు అన్ని యురేకా షోరూమ్‌లలో మే 14 2023 వరకు అందుబాటులో ఉంటాయి. ఇక కువైత్‌లో యురేకాకు మొత్తం ఆరు షోరూమ్‌లు ఉన్నాయి. హవాలీ, సాల్మియా, అల్ రాయ్, ఫర్వానియా, అల్ జహ్రా, ఫహాహీల్‌లలో ఈ ఆరు షోరూమ్‌లు ఉన్నాయి. ఈ ఆరు షోరూమ్‌లలో భారత ప్రవాసులు తమకు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను యురేకాలో అతి తక్కువ ధరకు పొందవచ్చు. దీనికి కేవలం సివిల్ ఐడీ చూపిస్తే సరిపోతుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







