గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్ కు ఘనస్వాగతం పలికిన బాలకృష్ణ
- April 28, 2023
విజయవాడ: టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు నేడు విజయవాడలోని పోరంకిలో జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు.
బాలకృష్ణ ను చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రజనీకాంత్…ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు. ఒకే కారులో నోవోటెల్ కు వెళ్లిన రజనీకాంత్ – బాలయ్య… ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రజనీకాంత్ రానున్నారు. తేనేటి విందు అనంతరం అక్కడి నుంచి రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ , చంద్రబాబు కుటుంబసభ్యులు.. అందరూ కలిసి సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు వెళ్ళనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







