ఐపీఎల్‌ చ‌రిత్ర‌లో టాప్-5 స్కోర్లు...

- April 28, 2023 , by Maagulf
ఐపీఎల్‌ చ‌రిత్ర‌లో టాప్-5 స్కోర్లు...

పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌ను ఊచ‌కోత కోస్తూ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌. ఈ సీజ‌న్‌లో ఇదే అత్య‌ధిక స్కోరు కాగా ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండో అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. 263/5 స్కోరుతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో ఉంది. 2013లో పూణే వారియ‌ర్స్‌పై ఆర్‌సీబీ ఈ స్కోరు సాధించింది. ఇక మూడో హ‌యెస్ట్ స్కోరు కూడా ఆర్‌సీబీ పేరు మీదే ఉంది. 2016లో గుజ‌రాత్ టైటాన్స్ పై 248/3 చేసింది. ఆ త‌రువాతి స్థానాల్లో చెన్నై, కోల్‌క‌తా జ‌ట్లు ఉన్నాయి.

ఐపీఎల్‌లో టాప్-7 స్కోర్లు...

2013 ఏప్రిల్ 23న పూణే వారియర్స్ ఇండియాపై ఆర్సీబీ-263/5
2023 ఏప్రిల్ 28న పంజాబ్ కింగ్స్ పై ల‌క్నో 257/5
2016 మే 14న గుజరాత్ లయన్స్ పై ఆర్సీబీ-248/3
2010 ఏప్రిల్ 3న రాజస్థాన్ రాయల్స్ పై సీఎస్కే 246/5
2018 మే12న పంజాబ్ కింగ్స్ పై కేకేఆర్ 245/6
2008 ఏప్రిల్ 19న పంజాబ్ కింగ్స్ పై సీఎస్కే 240/5
2015 మే 10న ముంబైపై ఆర్సీబీ 235/1

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com