గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాటం...
- April 28, 2023
హైదరాబాద్: విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' జరుపుకుంటారని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసి నాయకులు నరేంద్ర పన్నీరు అన్నారు. చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి అనే నినాదంతో శుక్రవారం (28.04.2023) నాడు గల్ఫ్ జేఏసి ఆధ్వర్యంలో జగిత్యాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
బి.ఎస్. రాములు, నరేంద్ర పన్నీరు కూర్పు చేసిన భారత రాజ్యాంగం - ముఖ్యాంశాలు అనే పుస్తకాన్ని ఈ సభలో ఆవిష్కరించారు. గల్ఫ్ వలస కార్మికుల హక్కులు, ఎన్నారైల ఓటు హక్కు గురించి ఈ పుస్తకంలో వివరించారు.
తెలంగాణాకు చెందిన ప్రవాసీ కార్మికులు గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి 200కు పైగా చనిపోతున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మోసం చేశాడు అని గల్ఫ్ JAC చైర్మన్ గుగ్గిళ్ల రవి గౌడ్ అన్నారు.
ప్రభుత్వాలు కార్మికులను (మానవ వనరులను) ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. ఇది పక్కా ఎగుమతి, దిగుమతి వ్యాపారం. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలకు మనం వెలకట్టగలమా? ఈ దేశం కోసం డ్యూటీలో భాగాంగా ఎడారిలో దిక్కులేని వారిగా చనిపోయిన మన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను "గల్ఫ్ అమరులు" అని పిలుచుకుందాం అని కల్లెడ భూమన్న అన్నారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ JAC నాయకులు చిలుముల రమేష్, వంకాయల కార్తీక్, బుతుక్కూరి కాంత, సాయిండ్ల రాజిరెడ్డి, నవీన్ కట్ట, సాజిద్, అంజి గంగాధర, బైరి కార్తిక్, గోపాల్ సేపూరీ, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







