చరిత్ర సృష్టించిన యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి

- April 29, 2023 , by Maagulf
చరిత్ర సృష్టించిన యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి

యూఏఈ: స్పేస్‌సూట్ స్లీవ్‌పై యూఏఈ జెండా.. 'ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్' లోగోతో ఎమిరాటీ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వెలుపల వాక్ చేసి చరిత్ర సృష్టించాడు. స్పేస్ వాక్ చేసిన తొలి అరబ్ వ్యోమగామిగా రికార్డు నమోదు చేశాడు. అల్నెయాడి, అనుభవజ్ఞుడైన నాసా వ్యోమగామి స్టీఫెన్ బోవెన్ సాయంత్రం 5.11 గంటలకు (యూఏఈ కాలమానం ప్రకారం) ఆరు గంటల పాటు స్పేస్ వాక్ ను ప్రారంభించారు. ISSలో ఉన్న నాసా ఫ్లైట్ ఇంజనీర్లు ఫ్రాంక్ రూబియో, వుడీ హోబర్గ్ కూడా వారికి సూట్ అప్ చేయడంలో సహకరించారు. ఈ సందర్భంగా "సుల్తాన్ అభినందనలు. మీరు ఈ రోజు చరిత్ర సృష్టిస్తున్నారు." అని హోబర్గ్ అభినందనలు తెలిపారు.

యూఏఈ  వ్యోమగామి హజ్జా అల్మన్సూరి.. 2019లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి ఎమిరాటీ. ఆ సమయంలో  ఎక్స్‌పెడిషన్ 69 ఇంక్రిమెంట్ లీడ్‌గా పనిచేశారు. అతను హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ నుండి మిషన్‌ను పర్యవేక్షించారు. మహ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC)లోని ఎమిరాటీ బృందం కూడా స్పేస్ వాక్ ని ప్రత్యక్షంగా తిలకించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com