యూఏఈ వేసవి సెలవులు: ఆసియా దేశాలకు పెరుగుతున్న డిమాండ్..!
- April 30, 2023
యూఏఈ: చాలా మంది యూఏఈ నివాసితులు ఈ వేసవిలో తమ సెలవులను.. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని టూర్లకు ప్లాన్ వేసుకుంటున్నారు. యూకే, ఇతర ఐరోపా విమానాశ్రయాలలో కొనసాగుతున్న అంతరాయాలతో ప్రయాణాలు ఆలస్యం కావడం, విమాన సర్వీసులు రద్దుల నేపథ్యంలో చాలామంది ఇంటికి కొన్ని గంటల దూరంలో ఉన్న గమ్యస్థానాలను టూర్ల కోసం ఎంచుకుంటున్నారు. దేశంలోని ట్రావెల్ ఏజెంట్లు నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలను హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం టర్కీ, ఈజిప్ట్‌లు మరోసారి ట్రాఫిక్‌ను పెంచుకోవడంతో ప్రముఖంగా మారాయని ఏజెంట్లు చెబుతున్నారు. ఎయిర్ ట్రావెల్స్ ఎంటర్ప్రైజ్ జనరల్ మేనేజర్ రీనా ఫిలిప్ మాట్లాడుతూ..కోవిడ్ -19 కారణంగా ప్రజలు ప్రయాణించడానికి భయపడిన గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ట్రాఫిక్ 22-30 శాతం పెరిగిందన్నారు. ఆసియా దేశాలకు సంబంధించినంతవరకు ఈ సంవత్సరం చాలా మంది ప్రజలు యూఏఈకి దగ్గరగా ఉన్న శ్రీలంకపై ఆసక్తి కనబరిచారని తెలిపారు. కానీ ఇవి సాధారణంగా నాలుగు నుండి ఐదు రోజుల చిన్న పర్యటనల కోసం ఉంటాయని, ఆ తర్వాత వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని అనుకుంటారని తెలిపారు. యూఏఈలోని ఉత్తర భారతీయులు కేరళ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తారని, కానీ దీనికి విరుద్ధంగా, చాలా మంది దక్షిణ భారతీయులు ఢిల్లీ, నేపాల్‌లోని ఖాట్మండు వంటి ఉత్తర భారత గమ్యస్థానాలకు వెళ్లాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
Musafir.com COO రహీష్ బాబు మాట్లాడుతూ.. వ్యక్తులు హాలిడే ప్లాన్లను రూపొందించడం వల్ల, ఖర్చుతో కూడుకున్న.. వీసా-స్నేహపూర్వక ప్రయాణ గమ్యస్థానాలకు అధిక డిమాండ్ ఉందన్నారు. అజర్బైజాన్, జార్జియా మరియు అర్మేనియా వంటి CISలోని దేశాలు అధిక డిమాండ్‌లో ఉన్నాయని, కజాఖ్స్తాన్, కిర్గిజ్‌స్థాన్‌లు మరింత ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. దీంతోపాటు సింగపూర్, కెన్యా, థాయ్‌లాండ్, మలేషియా వంటి గమ్యస్థానాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు. స్కెంజెన్ దేశాలు, యూకే, అమెరికా, కెనడాకు వీసాలు పొందడం ఇప్పటికీ ఒక సవాలుగా ఉందని, అందుకే వ్యక్తులు వీసాలు పొందడం ఇబ్బంది లేని దేశాలకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అయినప్పటికీ, భారతదేశంలో కోవిడ్ -19 కేసులు క్రమంగా పెరుగుతున్నా.. ఇది ఇప్పటివరకు ఉప ఖండంలోని అవుట్‌బౌండ్ ప్రయాణికులపై ప్రభావం చూపలేదని ట్రావెల్ ఏజెంట్లు అన్నారు. ఈ వేసవిలో యూఏఈలో 60 శాతం మంది ఆసియా దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుండగా.. 40 శాతం మంది ఐరోపా దేశాలను ఇష్టపడుతున్నారని ఏజెంట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







