ఐపీఎల్ 2023: ఢిల్లీ పై సన్‌రైజర్స్ విజయం
- April 29, 2023
న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితం కావడంతో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(63; 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లు), ఫిల్ సాల్ట్(59; 35 బంతుల్లో 9 ఫోర్లు) లు అర్ధశతకాలతో రాణించగా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, అకేల్ హోసేన్, అభిషేక్ శర్మ ఒక్కొ వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(67; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్(53 నాటౌట్ ; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) అర్ధశతకాలతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు మూడో విజయం. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచులో విజయం సాధిస్తేనే సన్ రైజర్స్ ప్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







