కవరులో తెల్ల కాగితం పెట్టి.. ఏమార్చి.. Dh100,000లను దొంగిలించిన ముఠా
- May 01, 2023
దుబాయ్: గల్ఫ్ పౌరుడిని ప్రలోభపెట్టి, మోసగించి, దోచుకున్నందుకు 42 ఏళ్ల అరబ్‌కు దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అతను దొంగిలించబడిన మొత్తం జరిమానా కింద చెల్లించాలని, శిక్షను అనుభవించిన తర్వాత అతడిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పోలీసు రికార్డుల ప్రకారం.. బాధితుడు ఒక వెబ్సైట్లో ప్రకటన చూసి లగ్జరీ కారును కొనుగోలు చేయడానికి వెళ్లాడు. అయితే, నిందితుల ముఠా ఒక కవరులో 100,000 దిర్హామ్‌లను పెట్టి తీసుకురావాలని చెప్పారు. విక్రేతనంటూ పరిచయం చేసుకున్న నిందితుడు.. డబ్బున్న కవరు చెక్ చేసి ఇస్తానని తీసుకున్నాడు. అనంతరం అదే కవరును బాధితుడు చేతిలో పెట్టి రోడ్డు అవతలి వైపున షోరూం ఉందని, అక్క డ మేనేజర్ అబూ అలీ ఉంటాడని, అతడిని కలిసి డీల్ పూర్తి చేసుకోవాలని సూచించిన నిందితుడు.. అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఆ అడ్రస్ లో నిందితుడు చెప్పిన వ్యక్తి లేకపోవడంతో బాధితుడు ఖంగుతిన్నాడు. అనుమానంతో కవర్ ని తెరిచి చూడగా అందులో నోట్ల స్థానంలో తెల్ల కాగితాల కట్టలు ఉన్నాయి. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. లగ్జరీ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారిని మోసం చేసేందుకు నిందితులు ముఠాగా ఏర్పడ్డారని పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడు నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. బాధితుడిని ప్రలోభపెట్టి, మోసం చేసి, తెల్ల కాగితంతో డబ్బు మార్పిడి చేయడం ద్వారా 100,000 దిర్హామ్‌లను దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో కోర్టు జైలుశిక్ష, జరిమానాలను విధిస్తూ.. తీర్పును వెల్లడించింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









