గత 3 ఏళ్లలో 1.15 మిలియన్ల ప్రవాసుల రెసిడెన్సీ రద్దు

- May 01, 2023 , by Maagulf
గత 3 ఏళ్లలో 1.15 మిలియన్ల ప్రవాసుల రెసిడెన్సీ రద్దు

కువైట్: గత మూడేళ్లలో 1.15 మిలియన్లకు పైగా ప్రవాసుల నివాస పర్మిట్లను కువైట్  రద్దు చేసింది.  చేయబడ్డాయి, అధికారిక డేటా ప్రకారం.. ఇందులో సొంతంగా దేశం విడిచి వెళ్లిన ప్రవాసులు, బహిష్కరించబడిన వారు ఉన్నారు. 2021లో 227,000 మంది ప్రవాసులు దేశం విడిచి వెళ్లారు. దాదాపు 160,000 మంది పరిహారం పొందకుండానే వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది గృహ కార్మికులుగా ప్రైవేట్, కుటుంబ రంగాలలో పనిచేస్తున్నారు. ప్రపంచం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఈ నివేదికలు కువైట్‌లోని వలస కార్మికుల జీవితాల నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

అయితే, అధికారిక డేటా ప్రకారం.. 2022 కార్మిక మార్కెట్లో ప్రవాసుల సంఖ్యలో గణనీయమైన పునరుద్ధరణను సూచిస్తుంది. 67,000 మంది కార్మికులు మొదటిసారిగా దేశంలోకి ప్రవేశించగా.. వీరిలో 64% మంది గృహ కార్మికులున్నారు. నిర్మాణ రంగం 2021లో 100,000 మందితో పోలిస్తే గత సంవత్సరం 218,000 మంది కార్మికులతో నమోదైన కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 146,000కి చేరుకుంది. ఫిషింగ్, వ్యవసాయ రంగంలో మొత్తం 74,000 మంది కార్మికులు ఉన్నారు. హోటల్ - రెస్టారెంట్ రంగంలో గత ఏడాది చివరి నాటికి 59,000 మంది కార్మికులు తగ్గడం గమనార్హం. మొత్తం 965,774 జనాభాతో దేశంలో అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీలలో భారతీయ సంఘం మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఈజిప్షియన్లు 655,234 మంది,  ఫిలిప్పీన్స్ (274,777), బంగ్లాదేశ్ (256,849), సిరియా (162310) ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com