అఖిల్ ‘ఏజెంట్’ అప్పుడే ఓటీటీ రిలీజ్.!
- May 01, 2023
‘ఏజెంట్’తో పెద్ద దెబ్బే తినేశాడు అఖిల్. భారీ అంచనాల నడుమ రిలీజైన అఖిల్ ‘ఏజెంట్’ డిజాస్టర్‌గా తేలిపోయింది.
అసలు ఓపెనింగ్స్‌కే నోచుకోలేకపోయింది అఖిల్. ప్రమోషన్ల పరంగా తనవంతు కష్టపడినా సరే, సరిపోలేదు. ఆడియన్స్ ఎందుకో అఖిల్‌ని కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు.
దాంతో, అఖిల్ ఎంత కష్టపడినా ఫలితం వృధా అయిపోతోంది. సురేందర్ రెడ్డిపై నమ్మకంతో ఈ సినిమాపై ఒకింత అంచనాలు క్రియేట్ అయినా.. రిలీజ్ తర్వాత సూరి ఫెయిల్యూర్ నెరేషన్‌ని ఆడియన్స్ తట్టుకోలేకపోయారు.
‘ఏజెంట్’ని డిజాస్టర్ ఖాతాలో చేర్చేశారు. ఇక, ధియేటర్లలో ‘ఏజెంట్’ వర్కవుట్ కాదని ఓ అభిప్రాయానికి వచ్చేసిన చిత్ర యూనిట్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోనీలివ్ ‘ఏజెంట్’ని ఆల్రెడీ బిగ్ డీల్‌కి కొనేసుకుందట. సో, వీలైనంత త్వరగానే క్యాష్ చేసుకోవాలన్న వుద్దేశ్యంతో రెండు వారాల లోపే సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేయాలనుకుంటున్నారట.
డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, మరికొద్ది రోజుల్లోనే ‘ఏజెంట్’ ఓటీటీలో స్ర్టీమింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







