కార్మికుల దినోత్సవం స్సెషల్.! ‘మెగా’ ట్రీట్ పోలా అదిరిపోలా.!
- May 01, 2023
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ నుంచి వెరీ లేటెస్ట్గా స్టిల్ రిలీజ్ చేశారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ స్టిల్‌కి మెగా రెస్సాన్స్ అదిరిపోతోంది.

‘భోళా శంకర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ట్యాక్సీపై కూర్చొని తన సిగ్నేచర్ స్టైల్లో టీ తాగుతున్న స్టిల్‌కి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ట్యాక్సీ డ్రైవర్ యూనిఫామ్‌లో మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మాస్ ఆడియన్స్‌కి స్సెషల్ కిక్ ఇస్తున్నాయ్. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది. తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.
‘వాల్తేర్ వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
ఒరిజినల్ వెర్షన్‌కి చిన్నా చితకా మార్పులు చేసి, చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్లుగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







