భారత్ కరోనా అప్డేట్
- May 02, 2023
న్యూఢిల్లీ: భారత దేశంలో గత కొన్ని రోజులుగా 10 వేలకు చేరువలో నమోదైన కేసులు.. ఇప్పుడు 5 వేలకు లోపే వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,45,309 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,325 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,52,996కి చేరింది.
మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 47,246 నుంచి 44,175కు దిగొచ్చింది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,43,77,257గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,564 కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.10 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,68,613) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







