కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
- May 02, 2023
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితర నేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో హామీలను గుప్పించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన హమీలు..
.ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
.కుటుంబ పెద్దగా ఉండే మహిళలకు నెలకు రూ. 2 వేలు
.నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3 వేల భృతి
.డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ. 1,500
.కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
.ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాది లోగా భర్తీ
.ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహార ధాన్యాలు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







