మన సంస్కృతి మరియు సంప్రదాయాలకు వేడుక DTA ఉగాది ఉత్సవాలు
- May 02, 2023
అమెరికా: USA లో 46 ఏళ్ల చరిత్ర ఉన్న DTA సంఘం (Detroit Telugu Association) మన సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి ప్రతి ఏటా నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా DTA ఉగాది ఉత్సవాలు కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించింది.
శనివారము (April 29th) జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 2200 మందికి పైగా హాజరయ్యారు , 300 పైగా ప్రతిభావంతులైన పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రముఖ గాయని సునీత మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ తోడు అవ్వటంతో DTA ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంతో ఆకాశాన్ని అంటాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రచయిత , మాజీ రాజ్యసభ సభ్యులు అయిన పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరై , తెలుగు పైన ఉన్న అపారమైన అనుభవం తో తనయొక్క ప్రసంగం ఇవ్వటం తో కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులకు ఉత్తేజాన్ని చేకూర్చారు.
ఈ కార్యక్రమం వివరాలు లోకి వెళ్తే , అత్యంత ప్రతిభావంతులైన పిల్లలు తమ యొక్క నాట్య, సంగీతం లతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమములు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు, తదుపరి గాయని సునీత కు గౌరవార్ధం శాలువాతో తెలుగు ఆడపడుచులు సన్మానం చేయబడింది. అనంతరం గాయని సునీత గారు తమ బృందం 7 నుంచి రాత్రి 12 వరకు పాటలతో డిట్రాయిట్ ప్రేక్షకులను అలరించారు.
మన తెలుగు రుచులు జోడించి రుచికరమైన వంటలతో భోజనాలు ఏర్పాటు చెయ్యటం జరిగింది, ప్రతి ఒక్కరికి భోజనం అందేటట్లు DTA సంఘము చాలా జాగర్తలు తీసుకోవటం తో , వచ్చిన ప్రేక్షకులు చాల సంతోషం వ్యక్తం చేయటం జరిగింది.
ఈ కార్యక్రమానికి 𝑇𝐴𝑁𝐴 బృందం అంజయ్య చౌదరి లావు, హనుమయ్య బండ్ల, సునీల్ పంత్ర, శ్రీనివాస్ గోగినేని, శ్రీని లావు, రాజా కాసుకుర్తి, ఠాగూర్ మల్లినేని, ఉమా అరమాండ్ల కాటికి, జానీ నిమ్మలపూడి, నాగమల్లేశ్వర పంచుమర్తి, హాజరయ్యరు వీరితోపాటు DTA పూర్వ అధ్యక్షులు నీలిమ మన్నే, జోగేశ్వరరావు పెద్దిబోయిన, కోనేరు శ్రీనివాస్, వెంకట్ ఎక్క, రమణ ముద్దెగంటి, సుధీర్ బచ్చు, ద్వారకా ప్రసాద్ బొప్పన,సత్యం నేరుసు, సంతోష్ ఆత్మకూరి పాల్గొన్నారు మరియు సభా వ్యాఖ్యాత గ ఉదయ్ చాపలమడుగు వ్యవహరించటం జరిగింది .
అంతేకాకుండా, ప్రతీది సజావుగా జరిగేలా తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేసిన ఈవెంట్ కోఆర్డినేటర్లు మరియు వాలంటీర్ అయిన కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, సుబ్రత గడ్డం, అర్చన చావళ్ల, ప్రణీత్ నాని, తేజ్ కైలాష్ అంగిరేకుల, దీప్తి చిత్రపు, స్వప్న ఎల్లెందుల, శృతి బుసరి, రాజా తొట్టెంపూడి, సంజు పెద్ది వారికీ DTA హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది .
ఈ సందర్బంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఇది ఒక మినీ కన్వెన్షన్ ను తలపించేలా జరిగింది అంటూ DTA అధ్యక్షుడు కిరణ్ దుగ్గిరాల ను మరియు DTA కార్యవర్గ సభ్యులను ప్రశంసించటం జరిగింది.



తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







