ఫ్లిప్‌కార్ట్ కొత్త సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- May 02, 2023
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ సంగారెడ్డిలో ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్‌ను వర్చువల్ విధానంలో మంగళవారం ఉదయం ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో జరిగిన ఈ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్పన లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే దేశం అదే ఫాలో అవుతుంది. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు విజయవంతంగా పని చేస్తున్నాయి. ఉపాధి కల్పనలో మహిళలకు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలి. దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గా మారుద్దాం అని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్‌తో పాటు పలువురు హాజరయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







