మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత
- May 02, 2023
ముంబై: మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈరోజు కొల్హాపూర్‌లో అరుణ్ గాంధీకి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. మనీలాల్ గాంధీ, సుశీల మషుర్వాలా దంపతులకు 1934, ఏప్రిల్ 14వ తేదీన డర్బన్‌లో అరుణ్ గాంధీ జన్మించారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో అరుణ్ గాంధీ నడిచారు. సామాజిక కార్యకర్తగా ఆయన ఎదిగారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







