జెడ్డా నుంచి 231 మంది భారతీయ పౌరులతో బయల్దేరిన విమానం
- May 03, 2023
జెడ్డా: సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీ అరెబియాలోని జెడ్డా నుంచి ముంబయి బయల్దేరింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఈ విమానంలో 231 మంది స్వదేశానికి తిరిగివస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి 328 మంది సూడాన్ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3 వేల మందిని క్షేమంగా తరలించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. సూడాన్‌లో అధికారం కోసం సైన్యంలోని రెండు గ్రూపులు ఏప్రిల్ 15 నుంచి పోరాడుతున్నాయి. దీంతో దేశంలో అశాంతి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న ఆపరేషన్ కావేరీని ప్రారంభించింది. ఇప్పటివరకు 11 విమానాల్లో సూడాన్‌ను భారతపౌరులను స్వదేశానికి తీసుకొచ్చారు.
కాగా, ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్అ ని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరాటం వల్ల ఇప్పటివరకు 3 లక్షల 30 వేల మందికి పైగా ప్రజలు వారివారి స్వదేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరో లక్ష మందికిపైగా సరిహద్దులు దాటి పారిపోయారని తెలిపింది. మొత్తంగా దేశం నుంచి 4 లక్షల 30 వేల మందికిపైగా దేశం నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నది.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్‌లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్‌కు విశిష్ట గుర్తింపు









