డా.బ్రహ్మానందం చే వంశీ రామరాజు కి 'కళా సమ్రాట్' బిరుదు ప్రదానం..
- May 03, 2023
హైదరాబాద్: దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు జన్మదినోత్సవం సందర్భంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా బ్రహ్మానందం, కళాబ్రహ్మ, సేవా మహాత్మ, పూర్వ సభ్యులు,భారతీయ సినిమా సెన్సార్ బోర్డ్ మరియు నంది అవార్డ్స్ కమిటీ, అధ్యక్షులు, వంశీ బర్కిలీ గ్లోబల్ ఫిల్మ్ అవార్డ్స్, శిరోమణి డాక్టర్ వంశీ రామ రాజుకి "దాసరి కళా సమ్రాట్" బిరుదు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు వివి వినాయక్, సి కళ్యాణ్, హీరో శ్రీకాంత్, రేలంగి నరసింహారావు,తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు..
పురస్కార గ్రహీత డాక్టర్ వంశీ రామరాజు తన ప్రసంగంలో మాట్లాడుతూ, దాసరి నారాయణరావు గారితో తనకు ఐదు దశాబ్దాల సన్నిహిత సంబంధం ఉన్నదనీ, దాసరికి, మొత్తం, వివిధ రంగాలకు చెందిన 75 వంశీ బర్కిలీ ఫిలిం అవార్డ్స్ బహూకరించామనీ, దాసరి జన్మ దినోత్సవాలని వంశీ సంస్థ ఘనంగా నిర్వహించిందని అన్నారు.
డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ వంశీ బర్కలీ ఫిలిం అవార్డ్స్ లో, మొట్టమొదటగా తాను ఉత్తమ హాస్యనటుడు పురస్కారాన్ని, ప్రముఖ చలనచిత్ర కథానాయకులు స్వర్గీయ దిలీప్ కుమార్ మరియు కథానాయిక సైరా బాను గారల చేతుల మీదుగా తీసుకున్నాననీ, వంశీ బర్కిలీ ఫిల్మ్ అవార్డ్సు కళాకారులకు ఎంతో ఆయవు పట్టుగా ఉండేవని అన్నారు.. అలాంటి వంశీరామరాజు గారికి 'కళా సమ్రాట్' బిరుదు బహూకరించాలని దాసరి ఫిలిం అవార్డ్స్ కమిటీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







