TANA ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథల పోటీలు
- May 05, 2023
అమెరికా: అమెరికాలో నివసిస్తున్న పిల్లలు, పెద్దలకు తెలుగు భాష పై మక్కువ, పటిష్ఠత, అభిరుచి పెంచడంతో పాటు పిల్లలకు భావ ప్రకటన పెంపుదల కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథలు చెప్పే పోటీలు’ నిర్వహిస్తోంది. కథలు చెప్పడం మన ప్రాచీన సంస్కృతి. ఈ ‘కథా కేళి’ పోటీలకు నమూనాగా 100 చిట్టి నీతి కథలను అందరూ సులువుగా చదివి, పోటీకి ప్రిపేర్ అవ్వడానికి అనువుగా పీడీఎఫ్ (pdf) పుస్తక రూపంలో పొందుపరచి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పోటీల్లో ఉత్తర అమెరికాలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీలలో పెద్దలతో పాటు వారి పిల్లలను ప్రోత్సహించి భాగస్వాములు చేయవలసిందిగా తానా కోరింది. కాగా, ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది మే 21, 2023. జూన్ 24, 25 తేదీల్లో ఆన్‌లైన్ వేదికగా జూమ్‌లో పోటీలను నిర్వహిస్తారు. దరఖాస్తు మరియు నియమ నిబంధనలు కోసం https://forms.gle/LCwLxCXjSRfubJ6S9 లింక్ పై క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







