లియోనెల్ మెస్సీకి సౌదీ క్లబ్ అల్ హిలాల్ నుండి 400 మిలియన్ డాలర్ల ఆఫర్..!
- May 06, 2023
సౌదీ:వచ్చే సీజన్‌లో సౌదీ అరేబియా క్లబ్ అల్ హిలాల్‌లో చేరేందుకు లియోనెల్ మెస్సీకి అధికారిక ఆఫర్ వచ్చినట్లు అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌కు సన్నిహితుడు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. సౌదీ క్లబ్ నుండి ఇప్పటివరకు మెస్సీకి అందిన ఆఫర్ ఒక్కటేనని ఆయా కథనాల్లో పేర్కొన్నారు. ఈ ఆఫర్ సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు అని అర్జెంటీనా మీడియా నివేదించింది. అయితే, దీనిపై అల్ హిలాల్ క్లబ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
35 ఏళ్ల మెస్సీ కూడా బాయ్‌హుడ్ క్లబ్ బార్సిలోనాకు తిరిగి వెళతాడని, యునైటెడ్ స్టేట్స్ మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి కూడా వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సౌదీ అరేబియాకు అనధికారిక పర్యటనకు వెళ్లిన క్రమంలో అతని ప్రస్తుత క్లబ్ పారిస్ సెయింట్ జర్మైన్ సస్పెండ్ చేసినట్లు కూడా ఫ్రెంచ్ క్రీడా దినపత్రిక L'Equipe మంగళవారం తెలిపింది. మెస్సీ పర్యటనకు ముందే అతని చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో డిసెంబర్‌లో సౌదీ క్లబ్ అల్ నాస్ర్ కోసం సంవత్సరానికి $220 మిలియన్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







