మరో ‘కశ్మీరీ ఫైల్స్’.! ‘ది కేరళ స్టోరీ’.!
- May 06, 2023
గతంలో హిందీలో తెరకెక్కిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమా ఏ స్థాయిలో సంచలనమైందో తెలిసిందే. నిజానికి ఈ సినిమా నెగిటివిటీతో మొదలై సంచలన విజయంగా నిలిచింది. అనూహ్యమైన వసూళ్లు కొల్లగొట్టింది.
ఇప్పుడీ తరహాలోనే ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదాస్పదమవుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా కాన్సెప్ట్ వుందని ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయ్.
ఇంత వ్యతిరేకత వున్న ‘ది కేరళ స్టోరీ’ మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. వివాదాలు వెంటాడుతున్నా సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. లవ్ జిహాదీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఓ వర్గం ముశ్లిం కమ్యూనిటీతో పాటూ, కొందరు హిందూ వ్యతిరేక సామాజిక వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయ్.
అయినా ఓ వర్గం సామాజిక వర్గం ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. దాంతో, ఈ సినిమా గురించిన చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా నడుస్తోంది. ఇదే ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. మొత్తానికి నెగిటివ్ పబ్లిసిటీతో కూడా సినిమాలు సంచలన విజయాలందుకుంటాయ్ అని ‘ది కేరళ స్టోరీ’ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







