మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు
- May 08, 2023
హైదరాబాద్: మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థులను మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి శంషాబాద్ కు తీసుకు వచ్చారు. విమానాశ్రయం నుండి విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించారు. మొదట షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం వారిని హైదరాబాద్ తీసుకు రావాల్సి ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సోమవారం వచ్చారు.
మణిపూర్ లో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో అక్కడి విద్యార్థులను ప్రభుత్వాలు తరలిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విద్యార్థులను హైదరాబాద్ తరలించారు. మణిపూర్ లో చిక్కుకున్న వారి సహాయార్థం ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ లలో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సహా మణిపూర్ లో ఉన్న తెలంగాణవాసుల కోసం ఆదివారం ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపించారు. సోమవారం మధ్యాహ్నం విమానం వారిని తీసుకు వచ్చింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







