నాలుగు ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించిన KFCA

- May 08, 2023 , by Maagulf
నాలుగు ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించిన KFCA

దమ్మామ్: సౌదీ అరేబియా, బహ్రెయిన్ రెండు దేశాలకు వెళ్లేందుకు ఉన్న టోల్ గేట్‌లలో చెల్లించడానికి  ప్రయాణికులను అనుమతించే 4 ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు కింగ్ ఫహద్ కాజ్‌వే అథారిటీ (KFCA) ప్రకటించింది. KFCA ఇంటిగ్రేటెడ్, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గేట్‌లను ఉపయోగించడం ద్వారా "Jesr" లేదా "కాజ్‌వే" యాప్ ద్వారా 4 ఇ-చెల్లింపు సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఆయా టోల్ గేట్లలో ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం ఆగాల్సిన అవసరం లేకుండానే చెల్లించి గేట్లను దాటవచ్చని అథారిటీ పేర్కొంది. బార్క్ టెక్నాలజీ, QR కోడ్ టెక్నాలజీ ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లు, ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID)ల సాయంతో యాపుల ద్వారా పేమెంట్ ప్రక్రియను క్షణాల్లో పూర్తిచేయవచ్చు. అదే విధంగా సౌదీ వైపున ఉన్న ప్రొసీజర్స్ ప్రాంతంలో ఉచిత వైఫై సేవను అందించనున్నట్లు KFCA ఇటీవల ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com