వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్..
- May 09, 2023
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ప్రత్యేకించి వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం ఎడిట్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ ఫీచర్ 2023 ప్రారంభంలో ప్రకటించింది. ఈ యాప్ బీటా వెర్షన్లో ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉంది.
వాట్సాప్ ట్రాక్ సైట్ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్లు ఇప్పుడు తమ మెసేజ్‌లను పంపిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ మెసేజ్ మెను ఆప్షన్ల నుంచి ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. చాట్‌లోని ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉన్నంత వరకు ఎడిట్ మెసేజ్‌లను అప్డేట్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్‌ని సపోర్ట్ చేయని పాత వెర్షన్ వాట్సాప్ యూజర్లందరికీ త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మెసేజ్‌లను ఎడిట్ చేసిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఈ ఆప్షన్ ఎంచుకోగానే.. మెసేజ్ కొత్త విండోలో ఎడిట్ ఆప్షన్‌తో ప్రాంప్ట్ విండో కనిపిస్తుంది.
మీ వాట్సాప్ అకౌంట్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే.. మీ చాట్లు, గ్రూపులలో మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు మీకు 15 నిమిషాల సమయం ఉంటుంది. వాట్సాప్ మెసేజ్‌లను అనేకసార్లు ఎడిట్ చేయడం సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది. వాట్సాప్ కాన్వరజేషన్ ప్రామాణికతను కొనసాగించవచ్చు. మెసేజ్‌లను ఎడిట్ చేసే లిమిట్ కూడా ఉంది. వాట్సాప్ యూజర్లు చాలా కాలం తర్వాత మెసేజ్ పూర్తిగా మార్చలేమని గమనించాలి. ఎందుకంటే ఈ ఫీచర్ టైపింగ్ లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగించాల్సిన టూల్ అని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







