దుబాయ్, షార్జాలో dh3కే కిలో మామిడిపండ్లు..!
- May 11, 2023
యూఏఈ: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. దుబాయ్, షార్జాలోని మార్కెట్‌లలో తాజా మామిడి పండ్లను విక్రయించడానికి అమ్మకందారులు పోటీ పడుతున్నారు.
అల్ అవిర్ మార్కెట్
ఇక్కడ భారతీయ అల్ఫోన్సో మామిడి పండ్లను కేవలం Dh3 ధరకు కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో ప్రతి స్టాల్ వద్ద విక్రేతలు తమ మామిడి పండ్ల తాజాదనం, నాణ్యత, ధర గురించి వివరిస్తారు. మార్కెట్లో ఉన్న పండ్ల రంగులు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రస్తుతం భారతీయ రకాలు (అల్ఫోన్సో, బాదామి, కేసరి). దీంతోపాటు ఒక యెమెన్ రకం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని అల్ అవీర్ మార్కెట్‌లోని 174 స్టాల్‌లో విక్రేత అనీస్ మొహమ్మద్ తెలిపారు. భారతీయ అల్ఫోన్సోకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుందని, ప్రతిరోజూ 3 కిలోగ్రాముల నుండి 5 కిలోగ్రాముల వరకు 30 బాక్సులను విక్రయిస్తామన్నారు. ఇక వారాంతాల్లో ఈ సంఖ్య వంద కార్టన్‌ల వరకు ఉంటుందని పండ్ల వ్యాపారి మహమ్మద్ తెలిపారు. ధర మీ బేరసారాల నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుందని, ఈ మార్కెట్‌లో సాధారణ ధర అల్ఫోన్సో కార్టన్‌కు Dh20, బాదామి, కేసరి కార్టన్‌కి Dh18 నుండి ప్రారంభమవుతుంది. యెమెన్ మామిడికాయలు కొంచెం ఎక్కువగా అంటే కార్టన్ ధర 25 దిర్హాంలుగా ఉంటుందన్నారు.
వాటర్ ఫ్రంట్ మార్కెట్
ఈ పండ్ల మార్కెట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పండ్లను ప్రదర్శిస్తారు. వాటిని కొనుగోలు చేసి తినడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ పండ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా, వాటిని కొనుగోలు చేయగలిగిన వారికి మాత్రం ప్రతి పైసా విలువైనదే. అయితే, ఇక్కడ కొన్ని రకాల మామిడిపండ్లు మాత్రమే ఉన్నాయి ‘‘ప్రతిరోజూ 50కిపైగా మామిడి పండ్లను విక్రయిస్తాం. అయితే, వారాంతాల్లో ఈ సంఖ్య రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతుంది, ”అని స్టాల్ నంబర్ 36 వద్ద విక్రేత ఇనాముల్లా చెప్పారు. వాటర్‌ఫ్రంట్ మార్కెట్‌లో భారతీయ మామిడికాయల పెట్టె 25 దిర్హామ్‌ల వద్ద ప్రారంభమవుతుంది. 5 కిలోగ్రాముల కంటే తక్కువ బరువున్న అల్ఫోన్సో మామిడి పండ్ల బాక్స్ ధర 40 దిర్హామ్‌లకు అమ్ముతున్నారు.
జుబైల్ మార్కెట్ షార్జా
షార్జాలో నివసించే వారికి సౌక్ అల్ జుబైల్ మామిడి పండ్ల ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడ అనేక రకాలను అమ్ముతున్నారు. ప్రసిద్ధ అల్ఫోన్సో మామిడి ఇక్కడి ఫేవరేట్. సౌక్ అల్ జుబైల్‌లోని A12 స్టాల్‌లో ఉండే అష్రఫ్ హుస్సేన్ మామిడి పండ్ల రుచిని పెంచే రహస్యాన్ని వెల్లడించాడు. "తరచుగా ప్రజలు పండును పూర్తిగా పండక ముందే తింటారు. మంచి రుచిని ఆస్వాదించాలంటే.. పంట కోసే తేదీని, రోజుల సంఖ్యను లెక్కించడం చాలా అవసరం. కోత తర్వాత 15-20 రోజుల మధ్య వినియోగానికి అనువైన సమయం. ఇది మంచి రుచిని కలిగి ఉంటాయి. ”అని అష్రఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







