ఏడాదిలో భారత్ చేరిన 1,100 మంది ఒమన్ బాధితులు..!
- May 11, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. గత ఏడాది కాలంగా 1,100 మందికి పైగా ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లారు. వీరిలో కార్మికులు, మహిళా గృహ కార్మికులు ఉన్నారు. ఈ వివరాలను ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో బుధవారం వెల్లడించింది. ఈ ప్రయత్నంలో "అద్భుతమైన సహకారం" అందించినందుకు సుల్తానేట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా 15 మంది మహిళా కార్మికుల బృందం స్వదేశానికి తిరిగి వెళ్లిందని భారత ఎంబసీ ప్రకటించింది. ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి, వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







