చేపల పొరుటు
- May 10, 2016
కావలసిన పదార్థాలు: (ముళ్లు తక్కువుండి, తల, తోక తీసేసిన) చేప ముక్కలు - 800 గ్రా., ఉల్లి తరుగు - అరకప్పు, వెల్లుల్లి రేకలు - 8, పచ్చిమిర్చి - 6, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2
టేబుల్ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: చేప ముక్కల్ని ఆవిరిపై ఉడికించి చల్లారిన తర్వాత ముళ్లు తీసేసి, చేత్తో పొడిపొడిగా చేసి పక్కనుంచాలి. నూనెలో ఆవాలు, మినప్పప్పు, (సన్నగా పొడుగ్గా తరిగిన) వెల్లుల్లి రేకలు, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించి ఉప్పు, పసుపు, కరివేపాకు కూడా వేసి చివర్లో చేప పొడి కలిపి చిన్న మంటపై 10 నిమిషాలు ఉంచాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో అలంకరించాలి. ఈ పొరుటును రసమన్నంలో నంజుకున్నా, చపాతీలతో తిన్నా బాగుంటుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









