ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్‌..

- May 10, 2016 , by Maagulf
ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్‌..

 ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసింది. ఈ యాప్‌ ద్వారా బస్‌ టికెట్లను బుక్‌ చేసుకోవడం, రద్దు చేసుకోవడం.. జీపీఎస్‌ ఆధారంగా బస్సు జాడ తెలుసుకోవడం, ఇంకా 'ఎం-వాలెట్‌' తదితర సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ యాప్‌తో పాటు విజయవాడలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని, సిటీ బస్‌టెర్మినల్‌ను సీఎం చంద్రబాబుతో నెలాఖరులోపు ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది.బహుళ ప్రయోజనాలు... ఆర్టీసీ యాప్‌లోని ఎం-వాలెట్‌లో డబ్బులు డిపాజిట్‌ చేసుకుని.. ఆ సొమ్ముతో టికెట్‌ కొనుగోలు చేసే ప్రయాణికులకు రూ.100 రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. ఒక్కో ప్రయాణానికి రూ.50 చొప్పున రెండు ప్రయాణాలకు ఈ రాయితీ ఇవ్వనుంది. బ్యాంకు ఖాతా నుంచి ఆర్టీసీ ఎం-వాలెట్‌లోకి డబ్బులు పంపినప్పుడు ఖాతాదారుపై బ్యాంకు విధించే సర్వీసు ఛార్జీని సంస్థే భరించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఏదైనా కారణం వల్ల ఈ-టికెట్‌ రద్దు చేసుకున్నప్పుడు.. ప్రయాణ సమయాన్ని బట్టి రద్దు ఛార్జీలు పెరుగుతుంటాయి. 48 గంటల ముందు రద్దు చేసుకుంటే.. రిజర్వేషన్‌, సర్వీసు ఛార్జీలు మినహాయించి మిగిలిన టికెట్‌ అసలు ధరను పూర్తిగా ఇస్తారు. యాప్‌ ద్వారా టికెట్‌ రద్దు చేసుకునే ప్రయాణికులకు సేవా రుసుములు మినహాయించకుండా పూర్తి మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com