మే 13న ఓ మల్లి విడుదల..
- May 10, 2016
బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓ మల్లి'. ఆర్.ఎ.ఎంటర్టైన్మెంట్ పతాకంపై బి.ప్రశాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న నైజాంలో విడుదలవుతుంది.ఈ సందర్భంగా బి.రమ్యశ్రీ మాట్లాడుతూ 'ఓ గ్రామంలోని యువతి జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా బాగా రావడం కోసం రెండు సంవత్సరాలు పాటు యూనిట్ సభ్యులంతా శ్రమించారు. ఇటీవల నైజాం మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఓ మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. సునీల్ కశ్యప్ సంగీతమందించిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె.దత్తు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మే 13న సినిమాను నైజాంలో విడుదల చేస్తున్నాం. ఇక్కడి ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం'' అన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







