మక్కాలో టాక్సీ లైసెన్సుల జారీ నిలిపివేత
- May 15, 2023
జెడ్డా: పవిత్ర నగరమైన మక్కాలో పబ్లిక్ టాక్సీలకు, ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా మార్చడానికి లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరించడాన్ని రవాణా మరియు లాజిస్టిక్స్ మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. ఈ మేరకు రవాణా, లాజిస్టిక్స్ మంత్రి ఇంజినీర్ సలేహ్ అల్ జాసర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మే 12న మంత్రిత్వ శాఖ నిర్ణయం వెలువడే ముందు సమర్పించిన దరఖాస్తులకు సంబంధించి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
మంత్రి నిర్ణయం ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియలు, నిబంధనలు, షరతులను ప్రైవేట్ టాక్సీ సంస్థలు దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలో పూర్తి చేస్తాయి. సౌదీ అరేబియాలోని రోడ్లపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చట్టం, జనరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిబంధనలు, పబ్లిక్ టాక్సీలు, టాక్సీ-క్యాబ్ బ్రోకర్లు, గైడెడ్ వాహనాల ఛార్జీలను నియంత్రించే నిబంధనలను ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







