అల్ దఖిలియాలో పర్యావరణ కాలుష్యంపై స్పందించిన అథారిటీ
- May 15, 2023
మస్కట్ : అల్ దఖిలియా గవర్నరేట్‌లో పర్యావరణ కాలుష్యానికి సంబంధించి ఎన్విరాన్‌మెంట్ అథారిటీ (EA) కీలక చర్యలు చేపట్టనుంది. ఈ సమస్యకు సంబంధించి సోమవారం ముఖ్యమైన సమావేశం నిర్వహించనుంది. అల్ దఖిలియా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ సమైల్‌లో మర్దామ్ హసాస్‌లో పర్యావరణ కాలుష్యం గురించి వార్తా పత్రికలలో వచ్చిన కథనాలపై అథారిటీ తన ట్విట్టర్‌లో అధికారిక ఖాతాలో స్పందించింది. అథారిటీ గతంలో చేపట్టిన విధానాలను పూర్తి చేయడానికి, పర్యావరణ అథారిటీ ఛైర్మన్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ అలీ అల్ అమ్రీ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు, నిపుణులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ పర్యటనలో బాధ్యులైన పార్టీలపై పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులను జారీ చేయడంతో పాటు నిర్ధిష్ట వ్యవధిలో పరిస్థితిని సరిదిద్దడానికి వారిని నిర్బంధించడంతో సహా అనేక చర్యలు తీసుకున్నట్లు అథారిటీ ధృవీకరించింది. దీంతో పాటు పర్యావరణ పరిశుభ్రత అమలు, ప్రమాదకర రసాయన పదార్థాలను సరైన మార్గాల్లో సరైన మార్గాల్లో పారవేయడం కోసం ప్రణాళికను రూపొందించాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







