మాదక ద్రవ్యాల రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!
- May 15, 2023
కువైట్: చట్టానికి ఎవరూ అతీతులు కాదని కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ అన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా సంబంధాలు, మీడియా సాధారణ విభాగం నుండి వెలువడిన ఒక ప్రకటన ప్రకారం.. చట్టం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని మంత్రి తెలిపార. మాదక ద్రవ్యాల వ్యతిరేక సిబ్బంది అవిశ్రాంత ప్రయత్నాలకు ఆయన అభినందనలు తెలిపారు. శనివారం కువైట్ వ్యాప్తంగా 152 కేజీల హషీష్, 8 కేజీల గంజాయి, 2 కేజీల షాబు, 150,000 క్యాప్‌గాన్ మాత్రలు, ఒక మిలియన్ లిరికా టాబ్లెట్‌లతో పాటు 5 లైసెన్స్ లేని తుపాకీలు, లైవ్ మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకోవడంపై ఆయన స్పందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







