యూఏఈ లో 47°C దాటిన ఉష్ణోగ్రతలు.. రెండు రోజుల్లో వర్షాలు?
- May 16, 2023
యూఏఈ: గత కొన్ని రోజులుగా యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే 14న అల్ దఫ్రాలో అత్యధికంగా 46°C నమోదుకాగా.. అంతకుముందు రోజు అల్ ఘేవీఫాత్లో 47.1°C ఉష్ణోగ్రత నమోదైంది. మే 15న కల్బాలో 44.6°C నమోదయింది. వేసవికి ముందు ఉష్ణోగ్రతల నుండి నివాసితులు కొంత ఉపశమనం పొందుతారని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) నుండి డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వారం చివరిలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కూడా పడతాయని చెప్పారు. దీంతో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు. అరేబియా గల్ఫ్‌లో సముద్రం మధ్యస్థం నుండి కొంత అల్లకల్లోలంగా ఉంటుందని, ఒమన్ సముద్రంలో మధ్యస్థంగా ఉంటుందని ఎన్సీఎం ప్రకటించింది. తీరప్రాంతాలలో తేమగా ఉంటుందని, కొన్ని పశ్చిమ ప్రాంతాలలో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







