రోజ్‌గార్ మేళా..అపాయింట్ మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన ప్రధాని మోడీ
- May 16, 2023
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మేళాలో పాల్గొన్నాయి. అపాయింట్‌మెంట్ లెటర్ పొందినవారు గ్రామీణ డాక్ సేవకులు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్‌లు, కమర్షియల్-కమ్- టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్-కమ్ -టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ వంటి వివిధ పోస్టుల్లో చేరనున్నారు.
గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేదని… ఫారం పొందేందుకు గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వచ్చేదని ప్రధాని మోడీ అన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక…ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం సులభమైందన్నారు. దరఖాస్తు చేసే దగ్గరి నుంచి ఫలితాల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని..కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదని అన్నారు. గ్రూప్ C&D పోస్టుల రిక్రూట్ మెంట్ లో అవినీతి బంధు ప్రీతి నిర్మూలించామన్నారు. భారత ప్రభుత్వం యొక్క ప్రతి పథకం, ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
ఉద్యోగాల సృష్టికి ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్రం తెలిపింది. దీనిలో భాగంగానే రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు, మోడీ 2.9 లక్షల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారని.. తాజా కార్యక్రమంతో ఆ సంఖ్య 3.6 లక్షలకు చేరుకుందని వివరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







