హైదరాబాద్ విమానాశ్రయంకు మరో అరుదైన గుర్తింపు
- May 18, 2023
హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ 2023 కార్యక్రమంలో ‘గోల్డ్’ పురస్కారాన్ని గెలుచుకుంది. HYD అంతర్జాతీయ విమానాశ్రయం ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన’కు గాను ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోని 15-35 మిలియన్ ప్రయాణికుల (MPPA) విభాగంలో ఈ అవార్డును గెలుచుకుంది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2018 నుండి ఈ అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా 6వ సారి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను దశలవారీగా నిర్మూలించడానికి కట్టుబడిన భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, GHIAL ఉద్యోగులు, భాగస్వాములు, సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం విస్తృతంగా పని చేసింది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణ ప్రభావంపై GHIAL అనేక అవగాహన సెషన్‌లను నిర్వహించి, సుస్థిరమైన విధానాలను అనుసరించే విధంగా వారిని ప్రోత్సహించింది. GHIAL కృషితో ఎయిర్ పోర్టులోని F&B కన్సెషనైర్లు క్రమంగా కార్న్ స్టార్చ్‌తో చేసిన ప్లేట్లు, చెక్క స్పూన్లు, ఫోర్కులు వంటి స్థిరమైన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలకు మారారు; రిటైలర్లు బయోడిగ్రేడబుల్ బాక్స్‌లు, కవర్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. ఇది కాకుండా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం GMR వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) ద్వారా జూట్ బ్యాగులు వంటి పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగాన్ని కూడా ప్రోత్సహించింది.
ఈ సందర్భంగా ఎస్‌జీకే కిశోర్, ఈడీ మరియు సీఐఓ-జీఎంఆర్ గ్రూప్, ఆసియా పసిఫిక్ రీజినల్ బోర్డ్‌లో మొదటి వైస్ ప్రెసిడెంట్ మరియు ACI వరల్డ్ గవర్నింగ్ బోర్డ్‌లో డైరెక్టర్, “ఒక సంస్థగా మేము అనేక పద్ధతులలో సుస్థిరతను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన అలాంటి చర్యల్లో ఒకటి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మేం చేపట్టే ప్రతి కార్యక్రమం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, వాతావరణ మార్పులను తగ్గించడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ అవార్డు సుస్థిరత దిశగా మొత్తం విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థ చేస్తున్న కృషికి ఒక గుర్తింపు. బయో డీజిల్‌ల వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాలు, EV ఛార్జింగ్ స్టేషన్‌లు వంటివి హరిత పర్యావరణ ప్రయోజనాలు ఇటీవల మా విమానాశ్రయంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు.’’ అని తెలిపారు.
ACI యొక్క గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ పర్యావరణంపై విమానయాన పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి ఉత్తమ పర్యావరణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇది అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టే ఆసియా-పసిఫిక్ సభ్యులను గుర్తిస్తుంది. GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) సుస్థిర విమానాశ్రయ కార్యకలాపాల ద్వారా పర్యావరణ పరిరక్షణను తన ప్రధాన నిర్వహణ సూత్రంగా స్వీకరించి ఆ దిశగా పని చేస్తోంది.

తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







