సౌదీలో ఏపీ యువకుడి కథ సుఖాంతం
- May 18, 2023
ఏపీ: ఇండియాలో సాధారణంగా వాడే ట్రామాడోల్ (Tramadol) ట్యాబ్లెట్స్ ను తెలియక సౌదీలో వాడుతూ.. అధికారులకు దొరికి నానా ఇబ్బందులు పడ్డ శ్రీకాకుళం జిల్లా ఎత్చెర్ల మండలానికి చెందిన వాసుపల్లి రాంబాబు(25) కథ సుఖాంతమైంది.
వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని ఒక నౌకయాన సంస్ధలో వాసుపల్లి రాంబాబు పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్ లో ఎర్ర సముద్ర తీరంలో తాను పని చేస్తున్న నౌక నుండి విధులు ముగించుకొని వస్తుంగా.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రాంబాబు బ్యాగులో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్ దొరికాయి. అయితే, సౌదీలో వాటిని వినియోగించడం చట్టరీత్యా నేరం. అవి మాదకద్రవ్యాల కేటగిరీలో ఉన్నాయి. దీంతో అతడిని సౌదీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
సముద్రయానంలో తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటే... ఇండియాకు వెళ్లిన సమయంలో వైద్యులకు చూపించగా ట్రామాడోల్ ట్యాబ్లెట్స్‌ను వాడమని రాసిచ్చారని చెప్పాడు. కానీ రాంబాబు ఎంత చెప్పినా అక్కడి అధికారులు పట్టించుకోకుండా జైలుకు పంపారు. కేసు పూర్తయ్యే వరకు సౌదీ విడిచి వెళ్ళకుండా అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
నెలలు గడుస్తున్న ఈ కేసులో ఏలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడి రాంబాబు తల్లి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ద్వారా ఎపీఎన్నార్టీ కో-ఆర్డినేటర్, తెలుగు కళా క్షేత్రం అధ్యక్షుడు రెవెల్ అంటోనీని సంప్రదించారు. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి రాంబాబు పై ఉన్న ట్రావెల్ బ్యాన్ ను తొలగించారు. దీంతో ఎట్టకేలకు రాంబాబు సోమవారం స్వస్ధలానికి చేరుకున్నాడు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







